Like This Page తెలుగు డాట్ బ్లాగ్ స్పాట్

Friday, August 9, 2013

ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ సాదించాలి అంటే కొన్ని టిప్స్

ఎగ్జామ్స్ లో మంచి  ర్యాంక్ సాదించాలి అంటే   కొన్ని  టిప్స్

చదవటం బోర్  కొట్టినప్పుడల్లా రాయటమో ,లెక్కలు చేయటమో చెయ్యండి , ఇష్టమైన   సబ్జెక్టు తో  చదవటం  ప్రారంబించి ,కష్టమైనది  తరువాత  చదివి.మళ్ళి  మరొక ఇష్టమైనది  చదవండి . పుస్తకం  ముందు  కూర్చుని " ఎందుకు  వచ్చిన చదువురా బాగావంతుడా ... " అని  మీలో  మీరే  వాపోవద్దు . అలా  చేసే కొద్ది పుస్తకం ఒక శత్రువుగా కనబడటం  ప్రారంబమవుతుంది .

తెల్లవారుజామున చదివితే అప్పుడు చదివింది సాదారణంగా మర్చిపోవటం జరగదు . మైండ్  ఫ్రెష్ గా వుంటుంది కాబట్టి మంచి సమయం చదవటానికి.

గది తలుపులు వేసుకోండి . చదువు బోర్ కొట్టినపుడు లేచి , గదిలోనే పచార్లు చేయండి . " నడవటం  కన్నా చదవటమే బాగుంది అని అనిపించినప్పుడు తిరిగి  కూర్చుని చదవండి .

ఒక పని ప్రరంబించడానికి కొన్ని ఆటంకాలుంటాయి . వీటిని ఇంగ్లీష్  లో 'రోడ్  బ్లాక్స్ " అంటారు . చదువుకి ముందు తలనొప్పిగా అనిపించటం ,ఇంకేదో పని దానికన్నా ముందు చేయాలనిపించడం , గది వేడిగా ఉంది అన్న ఇబ్బంది ఇవన్నీ ఉదాహరణాలు . వీటిని యెంత తొందరగా నిర్మూలించగలిగితే అంత   మంచిది . చదివే టైం దగ్గర పడే కొద్ది దాన్ని ఎలా వాయిదా పడేయాలా అనిపిస్తుంది . ఆహ్లాదరకరమైన విషయాల్తో ప్రారంబించి ,క్రమంగా చదువులోకి ప్రవేశించండి .